Monday, November 28, 2011

రోడ్డు పైన ఒక ధర్నా

ఇవాళ.....


రోడ్డు పైన ఒక ధర్నా చూశాను.


ఒక్కోరోజు ఒక్కో సమస్య


ఎవరెవరో కొత్త ముఖాల వాళ్ళు


నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు .


గొంతెత్తి నినదిస్తూనే ఉంటారు


వాళ్ళ డిమాండిస్స్ వాళ్ళ కుంటాయి


వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలి .


'ఏంటది ?' ఆగిన ట్రాఫిక్ లోనుంచి ఎవరో అడిగారు .


'ఏదో ధర్నా ...విసుగ్గా ఇంకెవరో జవాబిచ్చారు.
ధర్నా లో నుంచి వచ్చిన అంతరాత్మ ఒకటి ఇలా ప్రశ్నిచింది .....


"రోడ్డెక్కడం ఎవరికైతే మాత్రం ఇష్టం ?


సాటివాళ్ళ సమస్యల ఫై సానుభూతి కూడా లేకుండా జీవిస్తున్నవా?


నీ వరకు నష్టం జరిగితే గానీ నువ్వు స్పందించవు


మంటలు నీవరకు వస్తే గానీ దాని సెగ నీకు తెలియదు" అంటూ కన్నీళ్ళతో విన్నవించింది !


ఒక ధర్నా ,ఒక ర్యాలీ,


మనకు కాసేపు ఆటంకం మాత్రమే


వారికి ఒక జీవితకాల ఆకలి పోరాటం
ఇవాళ ....


రోడ్డు పైన ఒక ధర్నా చూశాను.


వారికి నా మద్దతు ప్రకటించాను !

Sunday, November 27, 2011

పాదాలు

రెండు చక్రాలు
ఒక మౌన హృదయం..
వారి కలలు వేరు ...ఉహలు వేరు ...
రంగుల లోకం చుట్టిరావాలానే ఆశ
కదిలే కాంతి తరంగాలఫై పయనించాలనే కాంక్ష
తీరం ఫై నిలబడి ఆకాశాన్ని చంబిచాలానే ఆకాంక్ష
పాపం కాదు , శాపం కాదు
కాసింత ఆత్మీయ స్పర్శ కావాలి.
పడిపోతున్నపుడు పట్టుకునే హస్తం ,
ఓడిపోతున్నపుడు గెలిపెంచే నేస్తం కావాలి .
వాళ్ళ పాదాలు కన్నీళ్ళు పెట్టుకుంటే
ప్రపంచం తలకిన్దులౌతుంది.
కరుణ నిండిన ఈ నాగరికత
వారి కోసం కొత్త చరిత్ర రాయాలి !
అప్పుడే .......
విశాల విశ్వం
వారి చక్రాల ముందు
ఎర్ర తివాచి పరుస్తుంది .
ఎవరన్నారు
వాళ్ళు నడవలేరని ...
మన మందరంలేమా!

Saturday, November 26, 2011

ప్లాట్ ఫాం

ప్లాట్ ఫాం లోకి ఇంకా రైలు రాలేదు ...
.ప్రయాణికులు రకరకాల శబ్దాలు వింటున్నారు ...
రకరకాల దృశ్యాలు చూస్తున్నారు...
వారికితెలియని ఒక ప్రపంచం అక్కడ నిర్మితమై ఉంది
కొడుకులు తరిమేసిన తల్లి
అనారోగ్యం తో తల్లడిల్లు ముసిలోడు
సవతి తల్లి సాధింపులకు ఇల్లు వదిలిన చిన్నారి
అప్పుడే రైలు కింద పడిన అనాధ దేహం
గాయాలతో యాచన చేస్తున్న రోగి
రెండు రైలు పట్టాల మధ్య ప్లాస్టిక్ పేపరైన అబ్బాయి
చెప్పుకొంటూ పొతే ప్లాట్ ఫాం పొడవంత జాబితా
రాసుకుంటూ పొతే రైలు పొడవంత జాతకం
ఇంకా రైలు రాలేదు ...
.ప్రయాణికులు రకరకాల శబ్దాలు వింటున్నారు ...
.రకరకాల దృశ్యాలు చూస్తున్నారు....
చాలా విషయాలు వారికి తెలిసినా , తెలియనట్లు జీవిస్తుంటారు ......
ప్లాట్ ఫాం వారికి రైలు ఆగే ప్రదేశం మాత్రమే !

Wednesday, November 9, 2011

ఒక తెల్ల పావురం - ఒక ఎర్ర గులాబీ

నాగరికత కొత్త దారి వెతుక్కొంటోoది
బంకర్లలో చరిత్ర నిర్మితమౌతోంది
లోహ విహంగాలు నీడలు పడ్తున్నాయి
నీ తల ఫైన వేలాడే కత్తి కి
నువ్విప్పుడు మోకరిల్లి
ప్రణామాలు ఘటిoచాలి !
ఎడారి తుఫాను లో ఒంటరి పావురం
ఒయాసిస్సు నిండా రక్తపు కలువలు
చూస్తున్న ప్రపంచం ఒక యుద్ధ కాండ.
రూపాలకు ముసుగులతో
స్వరూపాలు మార్చుకొని
నామరూపాలు లేకుండా
ఒక్కోసారి కీకారణాల్లో ,ఇసుక దిబ్బల్లో ,కొండ చరియల్లో,
నడి సంద్రాల్లో,భూగర్భాల్లో...
పరుగు ఆగితే ప్రాణం వైతరణి లో చిక్కు కుంటుంది !

యమపాశం పట్టుకొని నిల్చున్నవాడు

సామ్రాజ్య కాంక్ష అతడి తల ఫై కిరీటం
ఉక్కుపాదాలు,ఇనుప గొలుసులు ,ముళ్ళ పంజరాలు

మనిషికి స్వేఛ్చ ఒక మందు పాతర .

.తీరని కల ..కల్పితం... కల్లోలం ..!
నెత్తురు అంటని నేల ముద్దాడాలని ఉంది...

మన రాజ్యం మనకు ఎప్పుడు వస్తుంది ?
యుద్ధం ఇంకా ముగియ లేదు .
ఆయుధం అంతరించి పోనూ లేదు
ఎక్కడో ఓ చోట నిమిషం క్రితం కూడా
బుల్లెట్ - హృదయం తో మాట్లాడే ఉంటుంది
ఒక ఎర్ర గులాబీ పుష్ప గుచ్చం నివాళి గా మారి
రాతి సమాధి ఫై నవ్వుతుంటుంది !
ఆర్తనాదం కూడా వినపడనట్లుగా
ఈ లోకం జీవిస్తూ,నటిస్తూ ఉంటుంది .
ఒక శకం ముగిసి…
నాలుగు దిక్కులు ఎరుపెక్కిన తర్వాత ..

మరణం అంచున మహోదయం!
ఒక తెల్ల పావురం వాలడానికి ,
ఒక తెల్ల గులాబీ పూయడానికి ,
ఇప్పుడు కాసింత చోటు కావాలి..!
నువ్వు నడిచే నేలఏదైనా కావచ్చు ..

.చివరాఖరికి నువ్వో గుప్పెడు మట్టి వై …
కరిగిపోయిన కర్పూర దీపమై…మిగిలిపోతావు ...!


హంపి బజార్ (ఒక శిథిల జ్ఞాపకం )

చరిత్ర
చరిత్ర పాఠం
రెండూ వేర్వేరు
ఎతైయిన శిఖరం ప్రక్కనే లోతైన లోయలా!

చంద్రుని క్రింద ఉన్న
ఈ లోకం లో ప్రతిదీ మారుతూ ఉంటుందని
మరోసారి ఇలా లిఖించు కుంటూ...
ఒక జండా కింద
దిగ్విజయం గా వెలిగిన
చరిత్ర ఇప్పుడక్కడ లేదు .

ఏక కాలం లో
పగలూ రాత్రీ వీక్షించిన హంపి బజార్
చరిత్ర సమాధి మీద
గడ్డి ఇప్పుడిప్పు డే ఆకుపచ్చగా ...
ఎన్నెన్నో చూసిన నేల ;

పల్లకీ లో
రాణివాసపు స్త్రీలు
అపూర్వం గా విచ్చేసి ఆభరణాలు
ముచ్చట పడి కొనే దృశ్యం
పచ్చలు ,పద్మరాగాలు ,పగడాలు ..
ముత్యాలు ,కెంపులు ,రత్నాలు ...
నడి వీధి లో రాశులైన స్వర్ణ సౌందర్యం
ఆ వైభవాన్ని చూస్తూ
ఠీవి గా రొమ్ము విరుచుకొని
ప్రభువులు వీధులను సందర్శించే కాలం…
రథా రూడులై
ఇప్పుడిక ఎవరూ అటు రానవసరం లేదు
హంపి నగర యాత్ర
ఒక అసంపూర్ణం .

గడ్డి కాగితం ఫై ఈక కలంతో
మాస్టర్ ప్లాన్ గీశారు..
ప్రోక్లినర్ రాక్షస అవతారం ఎత్తింది .
చివరికి -
శిలలు ద్రవించి ఏడ్చినవి !
ఈ అజ్ఞానపు వృత్తాంతాన్ని
ఇకనైనా ఒక శాసనం చెక్కి
తుంగ భద్ర లోయ శిఖరం ఫై
నిలబెడితే గుర్తుగా ఉంటుంది .
ఇప్పుడు
విరుపాక్ష సన్నిధి బోసిపోయింది .
ఎప్పడైతెమాత్రం
మనం చరిత్రను మిగుల్చుకున్నాం !
న్యూనిజ్,ఫెరిస్టా లకు కూడా
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావలసిందే.
ఇప్పుడిక
విద్యారణ్యయతింద్రులకు
ఎవరు జవాబు ఇస్తారు?
తప్పదు -
'మధుర విజయం' ప్రదర్శన లో
సవరణలు చేసుకోవాలి .
బంగారు జరీ అంచు
వస్త్రాల కోసం -కురువిందల కోసం -
గరుడ పచ్చల కోసం
ఇప్పుడేవ్వురూ
చరిత్రను అన్వేషిం చాల్సిసిన అవసరం లేదు .
ఇప్పుడక్కడ చరిత్ర లేదు !
హంపి బజార్
ఇక -
మ్యూజియం లో
ఒక ఛాయా చిత్రం మాత్రమే !

( 16 వ శతాబ్దం నాటి విరుపాక్ష దేవాలయం ఎదురుగా కనిపించే హంపి బజార్ ను మాస్టర్ ప్లాన్ లో భాగంగా కూల్చివేసిన ఘటన కు విషాదంగా....)

HANDS OF SORROW

I saw a star dropped down
under the shadow of a lonely tree at the fag end of our street.
It has no light now
Not able to see the down
Can’t see moonlight either.
* * *
Every day carring morning
Taking along scriptures
Waking up the street, a sage
Whose voice is not being heard
Empty and a passive street melancholic.
They(sages) are seen limping
With seas of sorrow,
Meet you
There stood before you
The stretched hands that
Need no acquaintance
A big cry for each hand.

Wherever you stand
At Bus-stand, Rail way station,
Cinema, a crowded piace,
They appear.
Throwing a question at you
The alm-seekers with
Palms full of pitiable lines
The seven seas in heart of desert,
The tides of tears in a last life.
Each one a storm
Each one a tumult
The hands that cover you around an
Irritation for a day far you
For tham.

Living a life –struggle for food
A striving for a life –time.
Who makes them cross the
River of salvation(vaitharani)
With out the sorrows.
Who fills their hands with
Some roses
Some other litys
Some more marigoids
And makes their hearts
Beautiful gardens
I feel that
Their hands take in the
Divine nectar.
They are heard the tunes
Of the gods
I fell that a rainbow is
Plucked and kept in their hands.

* *

A White pigeon-A Red Rose

Civilization is trodding new paths
History is being made in burkers
Metal fliers are spreading shadows
You have to bow and pay trabutes
To the sword hanging on your head.

A lone pigean in a Desert storm,
Blloody lotuses filling the oasis,
The visibie world is a batlle field.
If the run stops in thick forests
Sand dunes,mountain ranges,mid oceans,
Underground,masking the faces,
Changing the appearences,
Losing the where abouts,life gets caught in the river of fire.

He stands with the grip of the god of death,
The greed of power is the crown on his head.
Feet of steel, chains of iron, cages of thorns,
Human freedom is a land mine.
Are we only the beaes of palan quin?
Two sentences of our own in history,
A flag of our own is an unrealized
dream… A fiction…A tumult.

I wish to kiss the bloodless floor.
When shall we get our land(kingdom),
The war hasn’t yet stopped.
Neither the weapon has been neutralized.
Some where in the world, a minute ago even,
A buiieat might have talked to the heart.

A red rose being turned into afiower bouqnet must be smiling.
Without hearing even a far cry,
This world lives and acts
At the close of a century

A grand down on the brink of death after the four corners turning red.
A littie space is needed for the white pigeon to perch and for the white lotus to bloom.
It may be any path tha you walks on.
At the very end,
You remain a handful of clay and an extinguished
Camphor lamp.