ఇవాళ కూడా మళ్లీ స్వాధీనం అవుతావా....
ఆవర్తనం మళ్లీ పునరావృతం ...జిల్లేడు పత్రం తీసుకొని పుణ్య తీర్థం కోసం ఇప్పుడు వెతుకుతూ బయలుదేరాలి .
ప్రవహించే నది ఇప్పుడు ఎక్కడుంది ? నువ్వు ఇంకిపోయేనట్లే అదికూడా ....!
ఎవరో చేసిన ఏడు జన్మల పాపం నిన్ను వెంటాడక తప్పదు .
వర్ణనకు అతీతంగా ఏక రూపం పొంది పర్వత గుహలో నువ్వుదాక్కొని
ప్రతి కల్పం లోను ఇవే గాధలు రాసుకుంటావు .
ఎనిమిది చక్రాల ఇనుప రధం నీ తరం ఫై నుంచి ముందుకు వెళ్ళిపోతుంది.
శాపం పోకుండా , పాప ప్రక్షాళన లేకుండా , చీకటి గొలుసుల వలయం లోనే నీ అనువంసికత జన్యువు .
దేహం నుంచి దేహానికి నువ్వు చివరిగా చెప్తున్న రహస్యం ఏమిటి ?
జంబూ ద్వీపం లోని నవవర్షాలలో భరత వర్షం కర్మ క్షేత్రం.
ఆవర్తనం మళ్లీ పునరావృతం ..
విముక్తి చూపని ఈ చరిత్రకొక ప్రణామం .!